
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా ప్రజా సంఘాల నాయకురాలు ఈదులకంటి రమాదేవి భర్త ఈదులకంటి నరేందర్ రెడ్డి ఇటీవలే అనారోగ్య కారణంగా మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను శుక్రవారం
రైతు, ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రజా సంఘాల నాయకులతో కలిసి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గము సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలోని వారి నివాసంలో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుడు నరేందర్ రెడ్డి భార్య రమాదేవితో పాటు కుమార్తెను, తండ్రిని ఇతర కుటుంబ సభ్యులను నాయకులు ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మృతుడు నరేందర్ రెడ్డి హుజురాబాద్ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సౌమ్యుడిగా స్నేహశీలిగా ఉండేవారని స్వగ్రామమైన రాయికల్ గ్రామ ప్రజల్లో విశేష ఆదరాభిమానాలు పొందారని, నరేందర్ రెడ్డి మరణం బాధాకరం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర రైతు మిత్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు గూడూరి స్వామి రెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, నాయకులు ముచ్ఛాసమ్మిరెడ్డి, కొన్ని సమ్మిరెడ్డిలు పేర్కొని నివాళులు అర్పించారు.


ప్రజా సంఘాల నాయకురాలు ఈదులకంటి రమాదేవి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెపుతున్న రైతు, ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రజా సంఘాల నాయకులు..





