
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో జలమయమైన లోతట్టు ప్రాంతాలను శుక్రవారం హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు సందర్శించి పరిశీలించారు. ఆయన హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడ, బుడగజంగాల కాలనీ, జమ్మికుంట రోడ్డు పరిసర ప్రాంతాలను తాసిల్దార్ కే కనుకయ్య, మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యలతో కలిసి సందర్శించి పరిశీలించి వర్షపు నీటి వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలను ఆయన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించాలని సూచించారు. గురువారం రాత్రి పలువురిని హుజురాబాద్ పట్టణంలో సాయి రూప ఫంక్షన్ హాలుడు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రంజిత్ రెడ్డి, శేఖర్ పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




వరద ముంపు ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆర్డీవో, తాసిల్దార్, కమిషనర్..





