Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ కోర్ట్ లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 924 కేసులకు పరిష్కారం లభించింది.
ఈ లోక్ అదాలత్ లో హుజురాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి .బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్షణికావేశంలో మనం పద్ధతులు మర్చిపోతామని తొందరపాటు వల్ల నేరం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అన్ని సమస్యలకు మూలం తొందరపాటు అని, రాజీ మార్గమే రాజా మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పద్మ సాయిశ్రీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వీణా ప్రణతి, స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ అఫ్ సెకండ్ క్లాస్ టి ఈశ్వరయ్య, హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, ఏసీపి మాధవి, అదనపు పబ్లిక్ పాసిక్యూటర్ ఎన్ రామ్ ఉపేందర్, ఏజిపి జీ శ్రీనివాస్, ఏ వెంకటేశ్వర్ రావు, సిఐ కరుణాకర్, పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.






