
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం ప్రతాపవాడ శిశు మందిర్ లో సేవా పక్షం-2025 పట్టణ కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యాశాలకు ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు మొదలుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వరకు 15 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సేవా పక్షం-2025లో భాగంగా సెప్టెంబర్ 17న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విశ్వకర్మ జయంతి అదేవిధంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ చెప్పిన విధంగా అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం ప్రతి బూత్ లో ప్రతి కార్యకర్త మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రధాన కుడలి లేదా ఏదైనా దేవాలయాల్లో స్వయంగా కార్యకర్తలు అందరూ కలిసి శుభ్రపరిచే కార్యక్రమం చేయాలని కోరారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఖాది వస్త్రాల ప్రచార కార్యక్రమాలు మహాత్మ గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు ఇందులో భాగంగా నిర్వహిస్తామని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలతో, మోడీ పరిపాలన దక్షతతో జనాలను ఆకర్షించిందని అని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రజలు బిజెపి వైపేజ్ చూస్తున్నారు బిజెపి స్థానిక సంస్థల ఎన్నికలలో విజయ డంకా మోగిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సేవ పక్షం-2025 పట్టణ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, మొహమ్మద్ అజార్, తిప్పబత్తిని రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, కౌన్సిల్ నెంబర్ రావుల వేణు, మహిళా మోర్చా అధ్యక్షురాలు వి చంద్రిక, బిజెపి సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, అంకతీ వాసు, గంట సంపత్, యంసాని శశిధర్, కొలిపాక వెంకటేష్, పడారి కొమురయ్య, సబ్బని రమేష్, కోడిమ్యాల పవన్ కుమార్, డోరి ఐలయ్య, మోషం వెంకటేశ్వర్లు, దేవేంద్ర, సబ్బని మాధవి, మాటూరి స్వర్ణలత, అయిత సందీప్, క్యాష వెంకటేష్, బెజ్జంకి రాజేందర్, పల్లె వీరయ్య, పిట్ట విజయ్ కుమార్, గరిగే శివకృష్ణ, సొల్లు సాల్మన్ రాజ్, తాళ్లపల్లి హరీష్, కాపర్తి అనిల్ కుమార్, హరీష్, కాపర్తి అనిల్ కుమార్, యాళ్ల రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







