
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని కనుకులగిద్ద గ్రామంలో విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బొడ్డెమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మహిళా మాత శక్తి గ్రామ అధ్యక్షురాలు లింగాల రజిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బొడ్డెమ్మ పండుగ అంటే ఏమిటి ? దాని విశిష్టతను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా బొడ్డెమ్మ పండుగను కన్నెపిల్లలు చేసుకునే పండుగని, వినాయక చవితి పండుగ తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి తొమ్మిది రోజులు అనగా అశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు జరుపుకునే పండుగ అని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి స్థానిక పుట్ట దగ్గరికి వెళ్లి పుట్ట మన్నుతో బొడ్డెమ్మను తయారు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కనుకులగిద్ద గ్రామంలో బొడ్డెమ్మ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని, భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తామని మహిళలందరూ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను ఆడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి గ్రామ శాఖ అధ్యక్షురాలు లింగాల రజిత లక్ష్మారెడ్డి, కంకణాల లక్ష్మి, లింగాల నీరజ, జాలి లక్ష్మి, రొంటాల జ్యోతి, లింగాల పద్మ, లింగాల లావణ్య, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

కనుకులగిద్ద గ్రామంలో బోడ్డెమ్మ ఆడుతున్న మహిళలు…





