
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ కరుణాకర్ పలు వాహనాలను తనిఖీలు చేసి వాటి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాహనాల తనిఖీని పర్యవేక్షించేందుకు హుజురాబాద్ ఏసిపి వి మాధవి హాజరై తనిఖీ తీరును పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని వారికి అపరాధ రుసుము విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి నడపరాదని పలువురుని మందలించారు. అయితే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి విఘాతం కలిగించకుండా ముందు జాగ్రత్తగా చర్యలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో హుజురాబాద్ ఎస్సై రాధాకృష్ణ, పలువురు పోలీసులు పాల్గొన్నారు.


డ్రంక్ అండ్ డ్రైవ్ ను పరిశీలించి టౌన్ సిఐ కరుణాకర్ కు సూచనలు చేస్తున్న ఏసిపి మాధవి..

వాహనదారులకు సేఫ్ డ్రైవింగ్ గురించి వివరిస్తున్న ఏసీపీ మాధవి..

బ్రీత్ అనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ రాధాకృష్ణ…





