Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
విద్యనభ్యసించే సమయంలో పిల్లలకు చదువుతోపాటు కలల పట్ల ఆసక్తి ఉండాలని, కలలు పిల్లల మానసిక వికాసంతో పాటు సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కలోత్సవాలు జరిగాయి. మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు గురుకుల పాఠశాలలకు చెందిన 12 రకాల అంశాలలో 90 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో విద్యతో పాటు 64 కలలలో కొన్నింటిలోనైనా ప్రావీణ్యత పొందాలని సూచించారు. మన దేశం కలలకు పుట్టిళ్ళని, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో అనేక గ్రామీణ కలలు ఉన్నాయన్నారు. ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ… పిల్లల సమగ్ర అభివృద్ధికి కలోత్సవాలు దోహదపడతాయని అన్నారు. కాగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. 12 రకాల అంశాల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి తిరుమల, ఎస్ అనురాధ, సంపత్, సతీష్, కూర్మాచలం వెంకటేశ్వర్లు, సీఆర్పీ దామోదరచారి, రవిబాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






