
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ కు యూరియా కొరత పై అవగాహన లేద అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరత పాపం కేంద్రానిదే నని, ఈ విషయంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు సరికావని అన్నారు. రాజకీయాలకంటే రైతుల ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం అని అన్నారు. దేశంలో రాష్ట్రాలకు యూరియా సరఫరాచేసేది కేంద్ర ప్రభుత్వం అని ఆది బీజేపీ ఎంపీలే చెప్పారని దానికి విరుద్ధంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, కేవలం తెలంగాణనే కాకుండా పక్కన ఉన్న బీజేపీ,ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా కొరత ఉందని, ఈ విషయంపై ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రణాళికబద్దంగా యూరియా సరఫరా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు కూడా పంపామని కేంద్రం నుండి రావాల్సిన యూరియా ఇవ్వలేదని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియా విషయంలో పిట్ట కథలు చెప్తున్నారని,వారి మాటలు చూస్తే బీజేపి, బిఆర్ఎస్ ములాఖాత్ బయటపడుతుందని, కేటీఆర్ వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందని బహిరంగంగా ఒప్పుకున్నారని, కాళేశ్వరం విషయంలో చిన్న స్థాయి ఉద్యోగి దగ్గరే వందల కోట్లు దొరికితే ప్రాజెక్ట్ రూపకర్త అని చెప్పే కేసీఆర్, కేటీఆర్ దగ్గర ఇంకా ఎన్ని కోట్లు దొరుకుతాయి అని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని దానికి అనుగుణంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నారని మళ్ళీ యూరియా కోసం అడిగారని తెలిపారు. రైతుల విషయంలో బిఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని రాజకీయాల కంటే రైతుల సంక్షేమం ప్రయోజనమే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు.
– ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న 147 లబ్ధిదారులకు చెక్కులను మంగళవారం కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు పంపిణీ చేశారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ లతోపాటు, 5 మండలాల కు చెందిన 54,31,500 రూపాయల విలువ గల 147 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేకల తిరుపతి, కొల్లూరు కిరణ్, సొల్లు బాబు, యేముల పుష్పలత, ఆలేటి సుశీల, రాధా, హనుమాన్ దేవాలయ చైర్మన్ కొలిపాక శంకర్, కాజీపేట శ్రీనివాస్, వడ్లూరు విజయ్, శ్రీనివాస్ యాదవ్, ఈ పెద్ది కుమార్, ఎస్ రమేష్, కొండల్ రెడ్డి, పంజాల రామ్ శంకర్ గౌడ్, నేరెళ్ల మహేందర్ గౌడ్, తాళ్లపెళ్లి రమేష్ గౌడ్, మహమ్మద్ ఖలీల్ హుస్సేన్, ఎండి అప్సర్, ఎండి తౌసిఫ్, ఎండి ఇమ్రాన్, ఉప్పు శ్రీనివాస్, ఆలీం, చంద్రశేఖర్, సందమల్ల బాబు, నరేష్, బిఆర్ గౌడ్, బిక్షపతి, రేణుక, మిడిదొడ్డి రాజు, స్వామిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



చెక్కుల పంపిణీ సందర్భంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్


చెక్కులు డిపాజిట్ చేసే విధానం గురించి వివరిస్తున్న ప్రణవ్…


చెక్కుల పంపిణీ హాజరైన లబ్ధిదారులు, ప్రజలు..




నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…





