Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్‌గా హుజురాబాద్ కు చెందిన రాచర్ల వేణు సేవలను గుర్తించి, రాష్ట్ర అధ్యక్షులు డా. మొగుళ్ల భద్రయ్య శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా డా. భద్రయ్య మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేరేలా కమిటీ సేవలు కొనసాగించాలని సూచించారు. మీడియా ద్వారా మానవ హక్కుల అవగాహన పెంపునకు కృషి చేయడం ఎంతో అవసరమని ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణవ్‌తో పాటు పలువురు ఎన్ హెచ్ ఆర్ సి కీలక సభ్యులు పాల్గొన్నారు.

ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్‌గా నియమించబడిన రాచర్ల వేణు…

ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్‌గా రాచర్ల వేణుకు అందజేసిన గుర్తింపు కార్డు..





