
– సైదాపూర్ క్రాస్ రోడ్ లో తాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రణవ్.
– సింగాపురం నుండి డిల్లీ దాకా ఎదిగిన రైతు బిడ్డ.
– రాజ్యసభ సభ్యుడిగా హుజూరాబాద్ ప్రాంతానికి ఎనలేని సేవలు.
– జయంతి వేడుకలకు భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా త్రాగునీటికి, విద్య పరంగా అనేక సేవలు రాజేశ్వర్ రావు అందజేశారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ వొడితల(సింగాపురం) రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులను ప్రణవ్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తాత ఆశయాలను కొనసాగిస్తూ, విద్య ఉద్యోగ కల్పనలో మొదటి స్థానంలో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.



రాజేశ్వరరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్, ఇతర నాయకులు..

ప్రధాన రహదారి డివైడర్లలో మొక్కలు నాటి నీళ్ళు పోస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





