
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త ముస్లిం మైనార్టీ నాయకుడు మొహమ్మద్ అఖిల్ పాషా గుండెపోటుతో నిన్న మృతి చెందగా ఆయన (జనాజ నమాజు)లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి అంత్యక్రియల్లో(జనాజ నమాజు)పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం చల్లూరుకు చెందిన అబ్దుల్ అఖిల్ పాషా నిన్న మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, అంత్యక్రియలలో పాల్గొనీ ముస్లిం జనాజ నమాజ్ అయ్యేంతవరకు వేచి ఉన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇచ్చి నేనున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు, గ్రామ మాజీ సర్పంచులు, చల్లూరు గ్రామ ముస్లిం మత పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





బిజెపి కార్యకర్త, ముస్లిం మైనార్టీ నాయకుడు మొహమ్మద్ అఖిల్ పాషా అంత్యక్రియల్లో(జనాజ నమాజు)పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్





