
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్, ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం పరామర్శించారు. రాచపల్లికి చెందిన ఆరెల్లి రమేష్ అమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బూజునూర్ లోని స్వామి, చేరాలు కుటుంబంతో పాటు విష్ణు, సరిగమల రమేష్ కుటుంబాలను మరిపెల్లిగూడంలో బండారి రాజు తండ్రి రాజయ్య కుటుంబాలను పరామర్శించారు. తమ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చిన అందుబాటులో ఉంటానని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంట KDCC వైస్ చెర్మన్ పింగిళి రమేష్, మాజీ మార్కెట్ చెర్మన్ సత్యనారాయణరావు, నాయకులు సరిగోముళ్ళ వెంకటేష్, చొక్కా రంజిత్, తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.







మృతుల కుటుంబాలను పరామర్శించి, నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





