Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ప్రారంభం: అక్టోబర్ 13; నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 21; నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22; నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24 అని షెడ్యూల్లో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కొత్త ఓటర్ల నమోదుకు 10 రోజుల సమయం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు.


హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్





