
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
స్ధానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను బిసీలకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టబద్ధత లేని జీఓ. నం 9కు వ్యతిరేకంగా హైకోర్టులో బలంగా వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఓ.సి సంఘాల జేఏసీ నాయకులు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు జేఏసీ అద్యక్షులు పోలాడి రామారావు తెలిపారు.
చట్టబద్ధత లేని జీవో నెం.9ను సవాల్ చేస్తూ రాష్త్ర హైకోర్టులో సెప్టెంబర్ 27నాడు లంచ్ మోషన్ లో రిట్ పిటిషన్లను WPNO.3027/2025 , WPNO 3029/2025 ప్రకారం రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య(OC SWAF)జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రాంరెడ్డిలు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు బుచ్చిరెడ్డి, విక్రమ్ రెడ్డిల ద్వారా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ముందుగా మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, న్యాయవాదులు బుచ్చిరెడ్డి, విక్రమ్ రెడ్డి లు మరికొందరు న్యాయవాదులతో కలిసి జీవో నెంబర్ 9 పై హైకోర్టులో బలంగా వినిపించిన వాదనలు హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవో నెంబర్ 9ను, స్ధానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలాడి రామారావు తెలిపారు. స్ధానిక సంస్థల ఎన్నికల కోసం ఆదరా బాదరాగా రాష్త్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9 లో అనేక లోపాలున్నాయని ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోఎదురు దెబ్బ తగిలిందని పోలాడి అన్నారు. బీసీ కులాల జనాభా లెక్కలపై ప్రభుత్వం నియమించిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని, ప్రభుత్వం సేకరించిన ఎంపరికల్ డాటా కూడా నిబద్ధతతో శాస్త్రీయంగా లేదని విమర్శలు వచ్చాయన్నారు. బీసీల జనాభా 2024ప్రకారం సర్వే చేశామని చెప్పినా. ఎస్సీ ఎస్టీల జనాభా మాత్రం 2011 ప్రకారం పరిగణించిందని యితర వర్గాల జనాభా లెక్కలు కూడా స్పష్టంగా లేవన్నారు. మార్చి లో ఆమోదించిన బిల్లులు పెండింగ్ లో ఉండగా , జూలైలో ఆర్డినెన్సు జారీ చేసి ఆమోదించుకోకుండానే చట్టం కానీ జీవో నెం 9ను జారీ చేసి స్ధానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్ళిందని పోలాడి ప్రశ్నించారు.
దీంతో తీవ్ర గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. చట్ట బద్దంగా లేని జీవో నెంబర్ 9కి వ్యతిరేకిస్తూ ఇతర వర్గాలవారు సైతం రిట్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
తాము బీసీ రిజర్వేషన్ల కు వ్యతిరేకం కాదని ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాకుండా అన్ని వర్గాల ప్రజలకు వివరించి బీసీల జనాభాకు అనుగుణంగా వారి మనోభావాలు దెబ్బతినకుండా చట్ట బద్దంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని పోలాడి రామారావు అభిప్రాయ పడ్డారు. ఇందుకు ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించించాలని రామారావు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ అద్యక్షులు పోలాడి రామారావు..

జీఓ. నం 9కు వ్యతిరేకంగా హైకోర్టులో బలంగా వాదనలు వినిపించిన న్యాయవాదులకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపూతున్న ఓ.సి సంఘాల జేఏసీ నాయకులు





