
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఒక పేద ముస్లిం కుటుంబానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ సోమవారం ఆర్థిక సాయం అందించారు.19వ వార్డుకు చెందిన అమీరున్ మనవరాలు వివాహానికి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తిరుపతి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మనవరాలు వివాహానికి సాయపడడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సొల్లు బాబు, 19 వార్డు అధ్యక్షురాలు సొల్లు సునీత, గోస్కుల రాజ్ కుమార్, గాలిబ్ నరేష్, ఎండి ఇమ్రాన్ లతో పాటు అమీరున్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


అమీరున్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుపతి, ఇతర కాంగ్రెస్ నాయకులు..





