
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దీపావళి పండుగ వేడుకలను హుజురాబాద్ డివిజన్లో సోమ , మంగళవారాలలో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం రాత్రి ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తాటి చెట్టు మట్ట చివరన నిప్పు అంటించి తమ చుట్టూ తిప్పుకున్నారు. సోమవారం నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున ఉదయం మహిళలు తలంటు స్నానం చేసి కుటుంబంలోని మగవారికి మంగళహారతులు ఇచ్చారు. అందరూ స్నానాలు చేసిన అనంతరం మిఠాయిలు తిన్నారు. కొంతమంది తమ ఇళ్లలో లక్ష్మీ పూజను సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లక్ష్మీదేవి తమ ఇంట ఉండి తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని వేడుకున్నారు. మంగళవారం కేదారేశ్వర వ్రతాలను ప్రజలు సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యుల బంధుమిత్రుల తో కలిసి జరుపుకున్నారు. వ్రతం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సహ పంక్తి భోజనాలు చేశారు. ప్రజలు తమ ఇళ్ళ ముందు దీపాలను అందంగా ఏర్పాటు చేశారు. మరికొందరు తమ ఇండ్లకు రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరింపజేశారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా టపాకాయలు కాల్చి దీపావళి పండుగ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దేవాలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలో టపాకాయల దుకాణాలను హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేయగా టపాకాయలు కొనుగోలు చేయడానికి వెళ్లిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురయింది. గత ఏడాది కన్నా ఈసారి టపాకాయలకు క్రాకర్స్ కు పెద్ద ఎత్తున వ్యాపారు రేట్లు పెంచడంతో ప్రజలు నామమాత్రంగా కొనుగోలు చేసి ఆనందపడవలసి వచ్చింది. ధరల నియంత్రణ చేసే అధికారులు ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చెప్పిన ధరలే వేదంగా కొనసాగింది. ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వేడుకలు చేసుకోవాలని చూసినప్పటికీ పెంచిన టపాకాయల ధరలతో సరిపడ కొనుగోలు చేయక ఉన్న వాటితోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల్లో హైస్కూల్ ప్రాంతం ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు రద్దీగా కనిపించాయి. మరోసారైనా సంబంధిత అధికారులు టపాకాయల దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొన్నారు. మొత్తం మీద దీపావళి వేడుకలు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

కేదారేశ్వర వ్రతంలో అమ్మవారికి నమస్కరిస్తున్న భక్తులు..


దీపాలు వేడుకలో పటాకులు కాలుస్తున్న తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్, కుటుంబ సభ్యులు..

క్రాకర్స్ కాలుస్తూ ఆనందపడుతున్న చిన్నారి..

కేదారేశ్వర స్వామిని దర్శించుకుని నమస్కరిస్తున్న భక్తులు…


తమ కుటుంబ సభ్యులతో కలిసి తాటి చెట్టు మట్ట చివరన నిప్పు అంటించి తమ చుట్టూ తిప్పుకుంటున్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దంపతులు..


దీపావళి వేడుకల్లో క్రాకర్స్ కాలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళలు, యువతులు, చిన్నారులు..
————-+++++————————-
&లోకల్ యాడ్స్&
—————-++++++++——————
##దీపావళి శుభాకాంక్షలు##






