Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) హుజూరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివాసి ముద్దుబిడ్డ కొమరం భీమ్ 125వ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ..భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన నాయకుడు కొమురం భీమ్ అన్నారు. ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించి, ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ అని అన్నారు. నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడీ కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులతో కలిసి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు కొమరం భీం పేరు చెప్పుకొని కమ్యూనిస్టు పార్టీలు ఆదివాసుల హక్కుల కోసం మేము కార్యక్రమాలు చేస్తున్నామని జబ్బలు కొట్టుకునే పరిస్థితి ఉంది కానీ కొమరం భీమ్ ఏనాడు కూడా అలా చెప్పలేదు. కాబట్టి నీటి యువత కొమరం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా యువత అందరూ కూడా ఈ దేశం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోయాల అంజి, సంయుక్త కార్యదర్శి అభిలాష్, సాయి, చరణ్, సిద్దు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను దర్శించి మాట్లాడుతున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్

——————++++++++—————–
&&లోకల్ యాడ్స్&&
————–++++++++—————–
##దీపావళి శుభాకాంక్షలు##






