
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :హుజురాబాద్ మండలం రంగాపూర్, పోతిరెడ్డిపేట, పెద్దపాపయపల్లి గ్రామాలలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రంగాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ఎడవెల్లి కొండాల్ రెడ్డి ప్రారంభించారు. పెద్దపాపయపల్లిలో ఏఏంసి డైరెక్టర్ చాంద్ ప్రారంభించారు. రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముద్రబోయిన శంకర్ సభ్యులు.గూడూరి. ప్రభాకర్ రెడ్డి,బొడ్డు. అనసూర్య, దండ.భాస్కర్ రెడ్డి, యాళ్ళ. సుజాత, గోస్కుల శ్రీనివాస్, ప్రతాప ఆంజనేయులు, నరెడ్ల మధుసూధన్ రెడ్డి, రవీందర్, లింగరావు, సాయిలు, లక్ష్మారెడ్డి, సీఈవో గోస్కుల వివేక్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




***పోతిరెడ్డిపేటలో….
పోతిరెడ్డిపేట గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ను హుజురాబాద్ ఎంపీడీవో సునీత ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి, ఏపీఎం జ్యోతి, స్పెషల్ ఆఫీసర్ మౌనిక,కార్యదర్శి లావణ్య, మండల సమైక్య అధ్యక్షురాలు సుకన్య, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అంగిడి రజిత, ఎలకపల్లి హైమావతి, ఉమాపతి రావు రైతులు పాల్గొన్నారు.





