
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ జిల్లా వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత కుటుంబాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బుధవారం స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులు మనోధర్యం కలిగి ఉండాలని, ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత విషయంలో న్యాయం జరిగే వరకూ బిజెపి అండగా ఉంటుందని గంగాడి కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న శ్రీ వర్షిత ఆత్మహత్య విషయంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలను తీర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఫుడ్ పాయిజన్ లు శరా మామూలుగా మారిపోయాయని ఆయన ఘాటుగా విమర్శించారు . విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాలను చక్కదిద్దాలనే ఆలోచన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, సర్కార్ బడులు, రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు రాముల కొమురయ్య , పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు , మండల ప్రధాన కార్యదర్శులు మోడెపు వినయ్, పారిపెల్లి కొండాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మర్రి రవీందర్, కార్యదర్శి చిదురాల శ్రీనివాస్ రెడ్డి, యువ మోర్చాల అధ్యక్షులు నరెడ్ల చైతన్య రెడ్డి, మహిళా మోర్చాల ప్రధాన కార్యదర్శి బండారి లావణ్య, మీడియా కన్వీనర్ మూదం మధు,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, రాంపూర్ బూత్ అద్యక్షులు మంతెన వరదేశ్వర్, గాలీబ్ కుమార్, బద్దం రాజీరెడ్డి, బద్దం బాల్ రెడ్డి, ముద్రబోయిన గాలయ్య, తాళ్ళపల్లి శ్రీనివాస్, పంజాల రాజేష్, గణేష్, సల్పల ప్రశాంత్, బంటు నవీణ్, బండారి శ్రీనివాస్, రావుల పున్నం, లాలు యాదవ్, పార్థీవ్ రెడ్డి, సాంబరాజు, తూర్పాటి రాజ శంకర్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

శ్రీ వర్షిత చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బిజెపి నాయకులు..





