Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలంలోని చిన్నపాపయ్యపల్లి గ్రామంలో ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం గ్రామంలో ఉన్న ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో ట్రాక్టర్ల అద్భుతమైన ప్రాముఖ్యతను గుర్తించేందుకు, ట్రాక్టర్ యజమానుల అంకితభావాన్ని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 6న “ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం”ను జరుపుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఒక కొత్త సంచలనానికి దారి తీసే అవకాశం కలిగించే రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గీసిడి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పల్లెబోయిన లక్ష్మయ్య, కోశాధికారి నరేడ్ల మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, సభ్యులు కిషన్ రెడ్డి, అనుమండ్ల వెంకట్ రెడ్డి, పల్లెబోయిన దేవరాజ్, తనుగుల ప్రవీణ్, రాజు, తిరుపతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొమురయ్య, రవీందర్, కుమారస్వామి, కిషన్, రొంటల ప్రభాకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.






