
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్వాతంత్ర ఉద్యమ సమయంలో కోట్లాదిమంది భారతీయుల్లో వందేమాతరం గేయంతో స్ఫూర్తి భారతీయుడు పొందాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వందేమాతరం గేయం రచించి150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం పట్టణ శాఖ అధ్యక్షుడు తూర్పాటి రాజు నాయకత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ వందేమాతరం గీతం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, భారతీయుల్లో చైతన్యాన్ని, స్ఫూర్తి, దేశభక్తి నీ రగిల్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల అధ్యక్షుడు రాముల కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, గంగిశెట్టి ప్రభాకర్, శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, రాజిరెడ్డి, తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, కొలిపాక శ్రీనివాస్, నల్ల సుమన్, పోతుల సంజీవ్, గంట సంపత్, వోడ్నాల చంద్రిక, మోతె తిరుపతి, అడ్వకేట్స్ భూమిరెడ్డి, అమరేందర్ రెడ్డి, గూడూరు సత్యనారాయణరెడ్డి, రవీందర్ రెడ్డి, నాంపల్లి సుమన్, మునిగంటి నాగరాజు, రాజేష్ కన్నా, దేవేంద్ర, పల్లె వీరయ్య, భాస్కర్ యాదవ్, పున్నం చందర్ పవన్ కొడిమ్యాల కొలిపాక వెంకటేష్ పంజాల లక్ష్మి సాయిబాబా, నాగరాజు, తిరుపతి, ఉమాశంకర్, విజయ్, అనిల్, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
…











