Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన క్రమంలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ పట్టణంలోని బిఎస్ఆర్ గార్డెన్స్ లో బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి కన్వీనర్ గా సందేల వెంకన్న వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తాను ఇచ్చిన మాటను నీటి మూటగా మార్చి బీసీలకు పాత రిజర్వేషన్ పద్ధతిని స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేస్తామని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ చట్ట ప్రకారము అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ సాధించుకునే అంతవరకు అంతం కాదు ఇది ఆరంభం అనే మాదిరిగా తమ పోరాటాన్ని రోజురోజుకు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా బీసీల రాష్ట్ర నాయకత్వం బీసీల రిజర్వేషన్ మద్దతుగా రాష్ట్రమంతటా పర్యటించి బీసీల అందరిని చైతన్య పరచాలని కోరారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఎర్రబొజ్జ నారాయణ,
వక్తలు:
తడికమల శేఖర్, కట్కూరి రాజేందర్, అఖిలపక్షాల మరియు ప్రజా సంఘాల నాయకులు: తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి సదానందం, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎనగందుల వెంకటేశ్వర్లు, తొగరు బిక్షపతి, సొల్లు బాబు, మాడుగుల ఓదెలు, చల్లూరి రఘు చారి, దేవునూరి రవీందర్, రామ్ సారయ్య, చిట్యాల భాను, తాటిపాముల కనకయ్య, బొంగోని వెంకటయ్య, చీకట్ల సమ్మయ్య, దొంత హరికిషన్, గాజర్ల బుచ్చిరాజం, ఓడ్నాల ప్రభాకర్, కే రామచంద్రం, గోస్కుల నాగమణి, మధుకర్, జూపాక శివమణి, గరవేణి శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులు..





