Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి నవంబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గౌరవించు కుంటామని..వారికీ 250గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని.. ఉద్యమకారులు ఎవరు అడగకున్న చెప్పడం జరిగింది కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటివరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దౌర్భాగ్యకరం అని కేయూ జేఏసి వ్యవస్థాపక సభ్యులు, కో కన్వీనర్ జవ్వాజి కుమారస్వామి (జేకే) పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్ లోనీ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో కేయూ జేఏసీ, ఓయూ జేఏసీ విద్యార్థి ఉద్యమకారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసి కేసులకు బెదరకుండా తుపాకి తూటాలను ఎదురోడ్డి నిలిచినటువంటి ఉద్యమకారులను గౌరవించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. బలిదానాలు.. ప్రాణ త్యాగాలు.. చేసినది విద్యార్థి నాయకులు ఇప్పటికి ఆర్థికంగా… మానసికంగా దెబ్బతినీ ఉన్నారన్నారు. కానీ రాజకీయ నాయకులు ఐతే .. మంత్రులు.. ఏంఎల్ఏ లుగా పదవులు పొంది.. పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. తక్షణమే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఉద్యమకారులకు ఇచ్చి వారి ఆకాంక్షను నెరవేర్చాలని లేదంటే రానున్న రోజుల్లో ఏ విధంగా పనిచేసినమో రేపు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అంతే పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మాట్లాడుతున్న కేయూ జేఏసి వ్యవస్థాపక సభ్యులు, కో కన్వీనర్ జవ్వాజి కుమారస్వామి (జేకే)





