
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గం వర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో హుజూరాబాద్ ప్రాంతo మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారని రాబోయే మరిన్ని ఎన్నికలు కూడా గులాబీ జెండా ఎగురుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లూ, గౌరవ మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు…

అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేస్తున్న తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్..




ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకల దృశ్యాలు…







