
– వైద్య సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంది
– వందలాది మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ నేరెళ్ల దామోదర్ అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని సంకల్పంతో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి పలు రకాల వైద్య నిపుణులు హాజరై అక్కడికి వచ్చిన ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దామోదర్ మాట్లాడుతూ… ప్రజలు మారుతున్న కాలానుగుణంగా ఆహార అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపాటి నిర్లక్ష్యంతోనే జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చెల్పూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి చక్కని స్పందన లభించిందని సుమారు 300లకు పైగా మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి వంతడుపుల కస్తూరి రఘు, ఉప సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మల్లికార్జున్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య శిబిరాన్నీ ప్రారంభిస్తున్న గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి రఘు

రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభిస్తున్న అమెరికా డాక్టర్ నేరెళ్ల దామోదర్




శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ దామోదర్, ఇతర వైద్యులు..

వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న అమెరికా వైద్యుడు డాక్టర్ నేరెళ్ల దామోదర్..





