
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ ప్రధానిగా పివి నరసింహారావు చేపట్టిన సంస్కరణలు, సేవలు భావితరాలకు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ తనయుడు పివి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పివి ప్రభాకర్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో సైదాపూర్ రోడ్ లో పీవీ సేవాసమితి, అలయన్స్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ క్లబ్బులో జరిగిన సభలో ప్రభాకర్ రావు మాట్లాడుతూ… పీవీ నరసింహారావు కు హుజురాబాద్ ప్రాంతoతో, ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఎక్కువ పనిచేసి తక్కువ మాట్లాడాలన్నదే తన తండ్రి పీవీ సిద్ధాంతమని, 17 భాషలు వచ్చినప్పటికీ అంతర్జాతీయ ఖ్యాతి గాంచినప్పటికీ సాదాసీదాగా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఆయన వేష భాషలు ఉండేవని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన పని చేసినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకో లేదన్నారు. ప్రజల డిమాండ్ మేరకు పీవీ జిల్లా ఏర్పాటు చేయడం సమంజసమేనని అన్నారు. అనంతరం మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు గ్రామీణ ప్రాంతం నుండి స్వయం శక్తితో ఎదిగి దేశమే కాకుండా ప్రపంచం గర్వపడేలా పరిపాలన చేశారని అన్నారు. ఆయన నిగర్వి అని, తన పని తాను చేసుకోవడం దేశాన్ని అభివృద్ధి చేయడమనే విషయం తప్ప ఇతర విషయాలు ఆయన పట్టించుకోలేదని అన్నారు. అనంతరం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ… పివి నరసింహారావు ఒక వ్యక్తి కాదని ఆయన దేశానికి ఒక శక్తి లాంటివాడని ఆయన చూపిన బాట భావితరాలకు ఆచరణ నీయమని అన్నారు.
భవిష్యత్ తరాలకు పీవీ మార్గదర్శిలాంటివాడని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని అన్నారు పి వి జిల్లా ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం
సభా అధ్యక్షుడు పివి సేవాసమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనిలో అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి మనోజ్, అలయన్స్ ఇంటర్ నేషనల్ డైరెక్టర్ ఎలాగందుల శ్రీనివాస్, శ్రీరామ్ రెడ్డి, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పులాల శ్యాం, డా విద్యాసాగర్, సాగి వీరభద్రరావు, తోట రాజేంద్రప్రసాద్, గుడిపాటి జైపాల్ రెడ్డి, బిల్డర్ శ్రీనివాసరావు, టి మాధవరావు, బెల్లి రాజయ్య, పాక సతీష్, బీమోజు సదానందం, వి ప్రభాకర్, చందా గాంధీ, సీడ్స్ సంపత్ రావు, కొండా గణేష్, పంజాల సుధాకర్, సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ఆయన కుమారుడు ప్రభాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్…

కార్యక్రమాన్ని దర్శించి మాట్లాడుతున్న పీవీ తనయుడు పివి ప్రభాకర్ రావు..

కార్యక్రమానికి హాజరైన వివిధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు..





