
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ అధ్యక్షునిగా భారత ప్రభాకర్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ లో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఉపాధ్యక్షులుగా తాటిపాముల కనకయ్య, గంగిశెట్టి సాంబయ్య, చొల్లేటి మల్లారెడ్డి, పరాంకుశం సనత్ కుమార్, కార్యదర్శులుగా కంది రాజిరెడ్డి, గాజర్ల బుచ్చిరాజం, పెద్దపేట రమేష్, స్వామి రెడ్డి, నల్ల రాజిరెడ్డి, జిల్లా కౌన్సిలర్లుగా చందుపట్ల జనార్ధన్, ధోనికన లింగయ్య, దొంత హరికిషన్ లను ఎన్నుకున్నారని తెలిపారు.
గత మూడు సంవత్సరములుగా టాప్ర హుజురాబాద్ శాఖ పెన్షనర్స్ కు గణనీయమైన సేవలు అందించి సభ్యుల మెప్పు పొందడం జరిగిందన్నారు. పెన్షనర్స్ బెనిఫిట్స్, పిఆర్ సి అమలు, డిఏల విడుదల కొరకు అనేక నిరసన కార్యక్రమాలు, ధర్నాలలో పాల్గొనడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్స్ కు పెనిషనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించి పిఆర్సి అమలు విడుదల తక్షణమే చేపట్టాలని జనార్ధన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కట్ట నాగభూషణచారి, బొంగోని వెంకటయ్య, జమ్మికుంట శాఖ అధ్యక్షుడు గరిగ చంద్రయ్య, కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ అధ్యక్షునిగా ఎన్నికైన భారత ప్రభాకర్

అసోసియేషన్ హుజురాబాద్ అధ్యక్షునిగా ఎన్నికైన భారత ప్రభాకర్ ను సత్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు, తదితర నాయకులు..

తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్..





