
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ధనుర్మాసంలో హిందువులు ఏకాదశి రోజున జరుపుకునే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరింపజేశారు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. పండుగ సందర్భంగా పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి ప్రత్యేకంగా తయారు చేశారు. మంగళవారం తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి వేడుకలను వేద పండితులు శ్రీధరాచార్యులు, వామనా చార్యులు, సంజయాచార్యులు, సంతోశాచార్యులు, నిఖిలాచార్యులు, సూదర్శనాచార్యులు సాంప్రదాయ బద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా ఆలంకరింపజేసిన పల్లకిపై దేవాలయం చుట్టూ భక్తులు తమ భుజాలపై మోస్తూ జై శ్రీమన్నారాయణ అని అంటూ భక్తిపారవశంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా వేద పండితులు వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో సవివరంగా సోదాహరంగా భక్తులకు వివరించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజల్లో హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీతారామస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ క్యాస చక్రధర్, కమిటీ సభ్యులు శ్రీహరి, మహాదేవ్, శ్రవణ్, శ్రీనివాస్, వికాస తరంగిణి అధ్యక్షులు యతిపతి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.





స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా ఆలంకరింపజేసిన పల్లకిపై దేవాలయం చుట్టూ భక్తులు తమ భుజాలపై మోస్తున్న భక్తులు..





