
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో శుక్రవారం సంక్రాంతి పండుగ వేడుకలు ముందస్తుగా ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలల మైదానాలను చక్కగా ఊడ్చి, అలుకు చల్లి అందమైన ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో బాలికలు మహిళా ఉపాధ్యాయురాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ముగ్గుకు బహుమతులను పాఠశాల యాజమాన్యాలు అందజేశాయి. పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ వాతావరణం తలపించే విధంగా అలంకరణలు చేశారు గుడిసే, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, హరిదాసు వేషధారణలు, సోది చెప్పే శోదమ్మ వేషధారణలు, బాలికల సాంప్రదాయ దుస్తులతో పాఠశాలల ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో చేసే వంటకాల గురించి పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భోగి మంటలు వేసి దాని చుట్టూ పిల్లలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. విజ్ఞాన్ స్కూల్లో ఎంవీఐ కంచి వేణు పాల్గొనగా..ఆయా కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు వి. వెంకటేశ్వర్లు, ఎం ప్రసాద్, ఏం నారాయణరెడ్డి పి సతీష్, విన్సెంట్ జార్జి, కోటేశ్వర్ యాదవ్, పి కిరణ్ కుమార్, పి రవీందర్ రెడ్డి, శాజు తామస్, బి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

శాతవాహన స్కూల్ లో..

శ్రీ కాకతీయ స్కూల్లో…


విజ్ఞాన్ స్కూల్ లో…






