
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: గ్రూహోపకర వంట గ్యాస్ వినియోగదారులు ఈనెల 31వ తేదీలోగా బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికణ(ఈ కేవైసీ) చేసుకోవాలని హుజురాబాద్ అంబుజా గ్యాస్ ఏజెన్సీ అధినేత, తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పివి మదన్మోహన్ రావు అన్నారు. శనివారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ…
పి.ఎం. ఉజ్వల యోజన వినియోగదారులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలు అందించే IOCL/BPCL/HPCL వంటగ్యాస్ వాడకం దారులు బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరన చేసుకోవాలని అన్నారు. మొదట డిసెంబర్ 31కి చివరి రోజు అని ప్రకటించినప్పటికీ,
అయితే ఎక్కవ సంఖ్యలో ఈకేవైసి చేసుకోనందున మరొక అవకాశాన్ని కస్టమర్లకు ఇస్తూ జనవరి 31 వరకు అడుగు పొడగించారని అన్నారు.
స్వయంగా EKYC చేసుకునే వారు ఆయిల్ కంపనీ
(IOCL/BPCL/HPCL) మొబైల్ ఆప్ ద్వారా EKYC చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
OMCమరియUIDAI యొక్క ఆధార్ ముఖ గుర్తింపు ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇచ్చిన క్యూఆర్ కోడ్ పొందుపరిచారని దానిని స్కాన్ చేసుకోవచ్చని లేదా https:www.pmuy.gov.in/e-kyc.html సందర్శించి సదుపాయం పొందవచ్చన్నారు.
గ్యాస్ కనెక్షన్లు పొందిన ఏజన్సీలో కాని యల్పీజి డెలివరీ బాయ్ ద్వారా EKYC చేసుకోవడాని అవకాశం వుందని ఆయన తెలిపారు. ఈకేవైసి చేయకపోతే గ్యాస్ రాయితీలు ఆగడమే కాక కనెక్షన్లు రద్దయ్యే అవకాశం వుందనీ, ఇది సాధారణ కస్టమర్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

అంబుజా గ్యాస్ ఏజెన్సీ అధినేత, తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పివి మదన్మోహన్ రావు





