
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడ శివాలయంలో శనివారం బిజెపి నాయకులు శివునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
సోమనాథ్ మందిరంపై గజినీ మహమ్మద్ 1026 సంవత్సరంలో దాడి చేయడం జరిగిందనీ, విశ్వాసం, నాగరికతకు సంబంధించిన గొప్ప చిహ్నంపై అనాగరిక దండయాత్ర జరిగి 2026 సంవత్సరంకు 1000 సంవత్సరాలు పూర్తయినధన్నారు. సోమనాథ మందిరం 1000 సంవత్సరాల సహనాన్ని, పునరుజ్జీవనాన్ని నిరంతరం నిలబడ్డానికి గుర్తుగా మనం సోమనాథ్ స్వాభిమాన పర్వంగా
జరుపుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు నాయకులు గంగిశెట్టి ప్రభాకర్, శశిధర్ , రాజశకర్ , రమేష్ , సంజీవరెడ్డి, సారయ్య తదితరులు పాల్గొన్నారు

శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న బిజెపి నాయకులు..






