
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీఎం కప్ క్రీడాజ్యోతి శనివారం హుజరాబాద్ పట్టణానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయడానికి క్రీడా జ్యోతిని కరీంనగర్ నుండి హుజురాబాద్ కు తీసుకొని రాగా హుజురాబాద్ సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ హుజురాబాద్ ప్రాంత క్రీడాకారులు స్వాగతం పలికి పట్టణ వీధుల గుండా జమ్మికుంటకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్పును విజయవంతం చేయాలని సీఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ ఓ శ్రీనివాస్ గౌడ్, టీజిపేట గౌరవ అధ్యక్షులు సొల్లు సారయ్య , ఎస్ జి ఎఫ్ హుజురాబాద్ కార్యదర్శి చిరుత శ్రీనివాస్, కే రేణుక, పత్తి రాజు, రాజ్ కుమార్, పంజాల తిరుపతి, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

సీఎం కప్ క్రీడాజ్యోతికి స్వాగతం పలుకుతున్న సీఐ కరుణాకర్..

సీఎం కప్ క్రీడాజ్యోతికి స్వాగతం పలుకుతున్న క్రీడాకారులు..


సీఎం కప్ క్రీడాజ్యోతికి స్వాగతం పలుకుతున్న బీసీ సంఘం డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్..





