Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, సీనియర్ పాత్రికేయుడు అనుమాస రాజేందర్ తన తల్లిదండ్రులైన స్వర్గీయ అనుమాస బుచ్చమ్మ- వీరయ్యల స్మారకార్థం (జ్ఞాపకార్థం) శనివారం గ్రామపంచాయతీకి సుమారు రూ.80వేలకు పైగా విలువైన డెడ్ బాడీ ఫ్రీజర్ అందజేశారు. గత కొన్నాళ్లుగా గ్రామస్తులు డెడ్ బాడీ ఫ్రీజర్ లేక ఇబ్బందులు పడుతుండడంతో స్వయంగా గమనించిన రాజేందర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కాగా ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు అనుమాస రాజేందర్ ను గ్రామ సర్పంచ్ తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి కస్తూరి, మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో డెడ్ బాడీ ఫ్రీజర్ అందజేస్తున్న సీనియర్ పాత్రికేయుడు అనుమాస రాజేందర్..





