
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రి ని కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అభినందించి సత్కరిస్తున్న సీఎం





