Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసి జేఏసీ జాతీయ ప్రథాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డిలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయడమేందుకని ప్రశ్నించారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో లక్షమంది తో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ ఏర్పాట్లపై జాతీయ, రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులతో సన్నాహక సభ, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి పలువురు ఓసి, రైతు, ప్రజాసంఘాల, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మాట్లాడు జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,

మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ ప్రథాన కార్యదర్శిగా సంధి తిరుపతిరెడ్డి..
ఈ సందర్భంగా పోలాడి రామారావు, సంధి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు, కూలీలు, యువత, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంటలకు నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా యువతకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రాజెక్టు నుండి ఏ విధంగా నీళ్ళు తీసుకు వచ్చి ఏ విధంగా ఇబ్బందులు తొలగించవచ్చో వాటర్ మేనేజ్ మెంట్ చేయవచ్చో కనీస సోయి కూడా రాష్ట్ర పాలకులకు లేకపోవడం దారుణం అని అన్నారు.
రైతులు పండించిన పంటలకు ఎకరాకు 3 వేలు రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని
ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయరంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడం తో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, వివిధ ఓసి కార్పొరేషన్ల నామ మాత్రంగానే ప్రకటించిన పాలకులు నిధులు, పాలకమండల్లను నేటికీ ఏర్పాటు చేయలేదని తక్షణమే ఆయా కార్పొరేషన్ లకు నిధులు విడుదల చేసి పాలకమండల్లులను ఏర్పాటు చేయాలని,
ఆర్ధికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకు వస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
పార్టీల కతీతంగా అందరినీ సభకు ఆహ్వానిస్తామని అన్ని జిల్లాలనుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చేలా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని నిర్వాహకులకు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు అప్పగించామని కేవలం ఒక్క ఉమ్మడి జిల్లా నుంచే సమావేశానికి 30 వేల మంది రైతులను తరలించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. జాతీయ రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నఈ సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ ప్రథాన కార్యదర్శిగా సంధి తిరుపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈ సమావేశంలో ఓసి ఐకాస జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ ఓసి జేఏసీ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐకాస అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, ఆర్య వైశ్య సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయిత నాగరాజు, రెడ్డి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బండ గోపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఓసి ఐకాస అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి,
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, నాయకులు చాడ రవీందర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కొత్తకొండ రవీందర్ రావు, గౌతమ్ శర్మ, చందుపట్ల జనార్ధన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పోలాడి రామారావు..


రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ ఏర్పాట్లపై జాతీయ, రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులతో సన్నాహక సభ, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్న పోలాడి రామారావు..





