
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏప్రిల్ 14న హుజురాబాద్ లో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకొనుటకు సన్నాహక కమిటీ సమావేశం శుక్రవారం హుజురాబాద్ క్లబ్ లో ప్రస్తుత చైర్మన్ మారేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మేధావులు ఉద్యోగులు, మహిళలు మరియు అంబేద్కర్ వాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి నూతన కమిటీ ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అంబేద్కర్ 136వ జయంతి కమిటీ చైర్మన్ గా విద్యావంతుడు అంబేద్కర్ వాది అయిన ఆడెపు సురేందర్ ను ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, బొరగాల మొగిలి, మహమ్మద్ ఖాళీక్ హుస్సేన్, నాయకులు రుద్రారపు రామచంద్రo, ఆలెటి రవీందర్, తాళ్లపల్లి రమేష్, చందుపట్ల జనార్ధన్, డాక్టర్ తడికమల్ల శేఖర్, కలవల మల్లయ్య, బొరగాల చల్లూరి రాహుల్, సారయ్య, సందెల వెంకన్న, వేల్పుల రత్నం, సిరిపాటి వేణు, తాళ్లపల్లి అమరేందర్, వేముల పుష్పలత, మొలుగు రాధ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతోత్సవ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఆడెపు సురేందర్





