
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన వార్షిక ఎవరిక ఫలితాలలో హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోర్డు ప్రకటించిన ఫలితాలలో ప్రథమ సంవత్సరం 45 %, ద్వితీయ సంవత్సరం 64% సాధించారు. కళాశాల టాపర్ గా
ఎంపీసీలో బి. శ్రావణి 971 మార్కులు, బైపిసి నుండి జానకిరామ్ 867 మార్కులు, సీఈసీ నుండి అనుశ్రీ 842 మార్కులు, హెచ్ఈసి నుండి అఖిల 644 మార్కులు సాధించారు,
మొదటి సంవత్సరంలో
ఎంపీసీ నుండి మేరీ ఏంజెల్ 457 మార్కులు, బైపిసి నుండి సాదియా కౌసర్ 382 మార్కులు, సీఈసీ నుండి సౌమ్య 420 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ ఆంజనేయరావు తెలిపారు. కాగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.





