Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు డంపింగ్ యార్డ్ రద్దు ఉద్యమ అఖిలపక్ష కమిటి పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిన సిర్సపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ రద్దు కోసం వెస్ట్ టు ఎనర్జీ రద్దు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా ప్రజలు నిరసన దీక్షలను స్వచ్ఛందంగా కొనసాగిస్తున్నారు.
ఈ దీక్షలలో ప్రత్యక్షంగా పాల్గొని డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతగా చేస్తున్న కృషికి ప్రజల పక్షాన డంపింగ్ యార్డ్ రద్దు కోసం పోరాడుతున్న వెస్ట్ టు ఎనర్జీ రద్దు అఖిలపక్ష కమిటీ కృతజ్ఞతలు తెలియచేస్తుంది.
ఇదే సమయంలో కొన్ని రాజాకీయ పార్టీల నాయకులు డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు చేస్తున్న నిరసన దీక్షలకు విఘాతం కలిగించే విధంగా పరస్పర విమర్శలకు పాల్పడుతున్న సందర్భాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
హుజూరాబాద్ ప్రాంత ప్రజలను డంపింగ్ యార్డ్ అనే భూతం నుండి కాపాడ వలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం డంపింగ్ యార్డ్ సమస్యను పక్క దారి పట్టించేందుకు యత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
అలాగే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షా శిబిరాన్ని తమ పార్టీల వేదికలుగా ఉపయోగించుకోవద్దని అన్ని రాజకీయ పార్టీలకు మా సవినయ విజ్ఞప్తి.
డంపింగ్ యార్డ్ ఈ ప్రాంత ప్రజలకు ఎంత ప్రమాదకరమో మీకు తెలియంది కాదు.
డంపింగ్ యార్డ్ రద్దు కోసం పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమ బాధ్యతలను ప్రజల కోణంలో నిర్వర్తించాలని కోరుతున్నాం.
ప్రజలకు ప్రమాదకారిగా మారనున్న డంపింగ్ యార్డ్ రద్దు కోసం జరుగుతున్న ప్రజాఉద్యమాన్ని కాపాడుకుందాం…
ఈ ఉద్యమం డంపింగ్ యార్డ్ రద్దు కోసమే…
ప్రజలే చరిత్ర నిర్మాతలు.
-వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వ్యతిరేకఅఖిలపక్ష కమిటీ, హుజూరాబాద్.. పేరుతో విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొందరు నేతలు అఖిలపక్ష కమిటీ చేస్తున్న ఆందోళనలను ఎవరికి వారే తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా రాజకీయాలకు పోకుండా ప్రజా సమస్యగా గుర్తించి అందరూ ఈ ప్లాంట్ వేయకుండా సమైక్యంగా పోరాడాలని హుజురాబాద్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.





