
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్నదాతల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో ఈనెల 28 న కరీంనగర్ లో రైతు మహాగర్జన సమరభేరి సమర భేరి సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. కరీంనగర్ లో రాష్ట్ర ప్రజా సంఘాల నేతల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమరభేరి సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లపై వివిధ జిల్లాల బాద్యులతో సమీక్షించారు. ముందుగా కరీంనగర్ కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావును రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూగంగుల కమలాకర్ ఇంట్లో రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రజా సంఘాల రాష్ట్ర ప్రతినిధులతో కలిసి కెటిఆర్ కు ఆహ్వాన పత్రికలను అందించి మహా గర్జన సమర భేరి సభ ఏర్పాట్ల గురించి వివరించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కెటిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న ధర్మ పోరాటానికి తాము మద్దతు ఇస్తామని తమ పార్టీ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చి రామారావుతో కలిసి సమరభేరి గోడ ప్రతులను ఆవిష్కరించారు.

కేటీఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేసి సమరభేరి గోడపత్రిక ఆవిష్కరిస్తున్న దృశ్యం.

అంతకు ముందు సిరిపురం కాలనీలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నాయకులతో కలిసి పోలాడి రామారావు ఆహ్వాన పత్రంను అందజేసి సమరభేరి సభకు మద్దతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించి గర్జన గోడ ప్రతులను కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసన సభ్యుడు చింతకుంట విజయ రమణా రావును సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ పోలాడి రామారావు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రం అందించి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించి సభకు హాజరు ఔతున్నట్లు ప్రకటించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో తాను ముందుంటాని ఎంఎల్ ఏ విజ్జన్న తెలిపారని అన్నారు.



మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవీందర్, పుట్ట మధు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ బీఎల్ రావు, మాజీ ఎంఎల్సి నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ సూడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ లను గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో పోలాడి రామారావు కలిసి ఆహ్వాన పత్రికలను అందించి వారిచే గోడ ప్రతులను విడుదల చేసి రైతుల కోసం నిర్వహించే సభకు హాజరు కావాలని కోరుతూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకు తలపెట్టిన సమరభేరి సభకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి సభకు అన్నీ విధాలుగా సహకారం అందిస్తామని తెలిపిన నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డినీ వారి కార్యాలయంలో కలిసి సమరభేరి సభకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించి వేలాది మందితో కలిసి సభకు హాజరు అవుతామని జోజీరెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు వారికి రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


హన్మకొండలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు సరోజనా దంపతులను, వారి కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ బాబులను పోలాడి రామారావు నాయకులతో కలిసి రైతుల మహాగర్జన సమరభేరి సభకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించి రైతుల మహా గర్జన సమర భేరి సభ గోడ ప్రతులను వారిచే పోలాడి ఆవిష్కరింప జేశారు. సానుకూలంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులు సమరభేరి సభకు మద్దతు ప్రకటించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్లు అందుకు వారికి రైతు ప్రజాసంఘాల సమాఖ్య తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ పాలకులు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఋణ మాఫీ 30 శాతం మంది రైతులకే జరిగిందని మిగతా 70 శాతం మందికి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓసి కార్పొరేషన్లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకలకే పరిమితం చేయడం సరి కాదన్నారు. ఓ పరిశ్రమ యజమాని తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయిస్తున్నాడని అదే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.


రైతుల న్యాయమైన డిమాండ్లను ఇతర సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈనెల 28న ఓసి ఐకాస ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, గోపు సత్యనారాయణరెడ్డి, కర్ర సూర్యప్రకాష్, చింతీరెడ్డి రమణారెడ్డి, కలకుంట్ల సత్యనారాయణరావు, సిరికొండ రమేష్ రావు, గంప నాగరాజు, కొండూరి పవన్, చంద్రశేఖర్, మేరుగు శ్రీనివాస్ గౌడ్, దుర్గం మురళీ, అవునూరి వరప్రసాద్, అల్లం సతీశ్, అంచూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.





