
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోమవారం హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రైవేటుకు దీటుగా ఉత్తీర్ణులు కావడం కాకుండా మంచి మార్కులు పొందడం అభినందనీయం అన్నారు. క్రమశిక్షణతో ప్రణాళిక బద్ధంగా చదివితే ఎవరైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆంజనేయ రావు, అధ్యాపకులు పి ప్రసాద్, బండి రాజశేఖర్, సురేష్, శైలజ, చరణ్, వెంకటరమణ, విజేందర్ రెడ్డి, సుగుణ, వనమాల, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.


ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న ఏసిపి మాధవి..


పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు..





