Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అనేకమంది ప్రాణాలను బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రమాద రహిత పట్టణం కోసం ప్రయత్నించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అరైవ్…అలైవ్ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు భద్రత అంటే భయం కాదు, బాధ్యత. మన ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎవరో ఒకరి జీవితాన్ని శాశ్వతంగా మార్చవచ్చు.
వేగంగా వెళ్లడం గొప్పతనం కాదు, సురక్షితంగా చేరడమే నిజమైన విజయం అని అన్నారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ నియమాలకోసం కాదు, మన కుటుంబాల చిరునవ్వుల కోసం. మద్యం తాగి వాహనం నడపడం మన జీవితానికే కాదు, ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం అని అన్నారు.
సిగ్నల్స్ పాటిస్తే శిక్ష తప్పదు కాదు, ప్రమాదం తప్పుతుంది. సెల్‌ఫోన్ చేతిలో పెట్టి డ్రైవ్ చేయడం, మరణాన్ని ఆహ్వానించడమే. రోడ్డు మనందరికీ పంచుకోబడినదే కాబట్టి నియమాలు పాటిద్దాం
ప్రాణాలు కాపాడుదాం భవిష్యత్తును సురక్షితంగా నిర్మిద్దాం అని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. హుజురాబాద్ ను ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, డిపో మేనేజర్ రవీంద్రనాథ్, బస్తీ దవాఖాన డాక్టర్ జరీనా, కౌన్సిలర్ రాజ్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, నాయకులు మేకల తిరుపతి, కోయల్ కార్ బాలాజీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





