
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దండుగుడుం మహేశ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అడ్వాన్స్డ్ నెట్వర్క్ భద్రతపై చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ లభించింది. హుజురాబాద్ పట్టణానికి చెందిన మహేశ్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగంలో పార్ట్ టైమ్ రీసెర్చ్ స్కాలర్ గా 2021 జూలైలో ప్రవేశం పొందారు. నెట్వర్క్ భద్రతా రంగంలో ఎస్డీఎన్ పరిసరాల్లో నెట్వర్క్ దాడులను గుర్తించడం, నియంత్రించే విధానాలు అనే పరిశోధన అంశంపై ఆయన పీహెచ్ డీ పూర్తి చేశాడు. దీంతో ఎస్సార్ యూనివర్సిటీలో ఆయనకు డాక్టర్ ప్రధానం చేశారు. మహేష్ కు డాక్టరేట్ రావడం పట్ల పట్టణానికి చెందిన ప్రముఖులు, కుటుంబసభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేసి, అభినందించారు.


డాక్టరేట్ అందుకుంటున్న దండుగుడుం మహేశ్




