
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులకు ఇచ్చిన హామీలు, డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో ఈనెల 28న కరీంనగర్ లో రైతుల మహాగర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో సమర భేరి సభ విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల జిల్లా నాయకుల నాయకులతో సమావేశం నిర్వహించి నిర్వహించి నియోజకవర్గ బాధ్యులతో సమీక్షించారు.

సమరభేరి సభ వాల్ పోస్టర్ల ను ఆవిష్కరిస్తున్న రామారావు, నాయకులు..
పోలాడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా కౌలు రైతులకు ఇచ్చిన హామీల అమలును పూర్తిగా విస్మరించారని, అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు మాత్రమే అర కొరగా ఇస్తూ మిసాగిస్తోందని విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే నిదులు విడుదల చేసి మభ్య పెడుతొందని మండి పడ్డారు.
అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 28 న ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సంయుక్తాద్వర్యంలో లక్షలాది మందితో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను రాజకీయాల కతీతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు పన్యాల భూపతిరెడ్డి, అయిత నాగరాజు, అంచూరి సదానందం, ఆదిరెడ్డి, భీమ్లా నాయక్, హంస కేతాన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ రావు తదితరులు ఉన్నారు.








