
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి – రంగాపురం సరిహద్దుల్లోని ఐలేని బోటి వద్ద ఐలేని మల్లన్న ఆలయం వంద సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ సంక్రాంతి పండుగ నుండి ఉగాది వరకు జాతర నిర్వహిస్తారు. డంపింగ్ యార్డు పడే ప్రదేశానికి సమీపంలో ఉండడంతో ప్రస్తుతం ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆదివారం రోజున బోనాలు, పట్నాలు, అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ నుండి ఒగ్గు కళాకారులు, విన్యాసాల కళాకారులు రానున్నారు. ఈ దేవాలయం ప్రత్యేకత సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ భక్తులు నమ్ముతారు. శివలింగం ఉంది, పుట్టు వెంట్రుకలు తీయడం ప్రశస్తిగా ఉంది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో పెద్ద పట్నాలు వేస్తారు, ఈ సందర్భంగా ఘనంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు1500 మందికి బోజనాలు ఏర్పాట్లూ చేస్తున్నారు. సిరసపల్లి, రంగాపురం, కొత్తపల్లి, సింగాపురం, తుమ్మనపల్లి సరిహద్దులో ఉండడంతో అక్కడి ప్రజలు, యాదవ, కుర్మా కులస్తుల ఆద్వర్యంలో జాతర నిర్వహిస్తారు. హుజురాబాద్ మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల్లోనీ ప్రజలను ఆహ్వానించారు. అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ పోలసాని రామారావు, అఖిలపక్ష కమిటీ నేతలు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి జాతర వద్ద కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. చుట్టుప్రక్కల గ్రామాలలోని వేలాది మంది ప్రజలతో, భక్తులతో జాతర ప్రాంతమంతా కిక్కిరిసి కళకళలాడనుండడంతో అందరి దృష్టి రేపు నిర్వహించే జాతరపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.



జాతర వద్ద ఐలోని దేవుడు…





