
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మ వికాసానికి ప్రతీక, అభివృద్ధి కామికుడు నిత్య శ్రామికుడు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడు విజనరీ నాయకుడు, యువతరానికి లాండ్ మార్క్ లా నిలిచే మార్గదర్శకుడు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొని రాణించి అద్భుతాలు సృష్టించిన అపర చాణక్యుడు, నిరంతరం ప్రజా శ్రేయస్సు అభివృద్ధి కోసం ఆలోచించే శ్రమజీవి నారా చంద్రబాబు అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.

నారా చంద్రబాబునాయుడు 76వ జన్మ దిన కార్యక్రమాన్ని కరీంనగర్ లోని హోటల్ శ్రీనివాస్ ఆవరణలో ఓసి ఐకాస, ప్రజా సంఘాలు, టీడీపీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.
రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు, పంపిణీ చేశారు.
సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పరిపాలన సాగిస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళకు రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్వయం సమృద్ధితో సార్థకత చేకూరుస్తూ మహిలల పాలిటదేవుడు ఇచ్చిన అన్నగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని పోలాడి రామారావు కొనియాడారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని పోలాడి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులను పోలాడి రామారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలాడి రామారావుతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్, కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీ రాజ్ కుమార్, ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘాల కన్వీనర్ బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఓసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చింతిరెడ్డీ రమణారెడ్డి, టిడిపి రాష్ట్ర వాణిజ్య సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎలిమిల్లి కిషన్, రాష్ట్ర యువత ప్రథాన కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, నాయకులు ఇట్ట మల్లేశం, గోపు గోపాల్ రెడ్డి, బంజేరు పల్లి సర్పంచ్ తోట శ్రీనివాస్, కళ్యాడపు నరేష్, కొరిమి వేణుమాధవ్, కలకుంట్ల సత్యనారాయణ రావు, రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ కార్యదర్శి దడిగల వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

టిడిపి సీనియర్ నాయకులను సన్మానిస్తున్న పోలాడి రామారావు..






