
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్ లో బస్సు ఎక్కిన రిటైర్డ్ హెల్త్ ఉద్యోగి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం కలకలం రేపింది. పలువురు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కవ్వ రాజిరెడ్డి (74) వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. ఓ కేసు విషయంలో హుజురాబాద్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో హుజురాబాద్ బస్టాండ్ లో బస్సు ఎక్కగా ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యారు. వెంటనే స్థానికులు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజిరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడిది శంకరపట్నం మండలం ఎరుకల గూడెం కాగా ఉద్యోగరీత్యా వెళ్ళి మంచిర్యాలలో సెటిల్ అయ్యారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

గుండెపోటుతో మృతి చెందిన కవ్వ రాజిరెడ్డి (74)






