
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) : స్కూల్స్ కాలేజీలు వేసవి సెలవుల సందర్భంగా ఆశిష్ స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో సమ్మర్ డాన్స్ క్యాంపును జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో సోమవారం టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆశిష్ స్కూల్ ఆఫ్ డాన్స్ అధినేత బూడిద ఆశిష్ రంగంలో వందలాది సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన గొప్ప అనుభవం ఉందని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులు వేసవి సెలవులను వేసవి బావులలో ఈతలకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, మొబైల్ ఫోన్స్ ఆకర్షితులు కాకుండా సన్మార్గంలో వెళ్లేందుకు క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు డాన్స్ కళ స్నేహభావాన్ని పెంపొందించడానికి శారీరక మానసిక ఉల్లాసానికి డ్యాన్స్ దోహదపడుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అతిధులు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), శీలం శ్రీను (27th వార్డ్ కౌన్సిలర్ )
సాయిని రవి (టీపీసీసీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్) సుంకరి రమేష్ (పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు)
చించు రమ (12 th వార్డ్ కౌన్సిలర్ )
దిడ్డీ రాము, కుతడి తిరుపతి (18 th వార్డ్ కౌన్సిలర్గ గడ్డం దిక్షీత్, వడ్లకొండ రమేష్, పాతకాల ప్రవీణ్,
ఇమ్మడి సతీష్, మంద వేణు, దొడ్డే సదానందం,
తదితరులు పాల్గొన్నారు.





