
—త్వరలో పనులు చేపడతామని హామీ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీణవంక, జమ్మికుంట మండలాల్లోనీ రైతులకు సాగు నీరు అందించే కల్వల ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ సచివాలయంలోని వారి ఛాంబర్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే గుంపుల – శంభునిపల్లి గ్రామాల పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా త్వరితగతిన పునరుద్ధరణ చేయాలని కోరారు. రైతులకు సాగు నీటి విషయంలో ఇబ్బందులు కలగకుండా చాలా ఉపయోగపడతాయని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారన్నారు.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





