
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి సిర్సపల్లి గ్రామ శివారుకు మధ్యలో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు రద్దు కొరకు వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష పోరాట నాయకులు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ డంపు ప్రాజెక్టు నిర్మాణం వలన చెత్తలోని రసాయనాలు భూమిలో ఇంకిపోవడం వల్ల దాదాపు 25 కిలోమీటర్ల వరకు భూమిలోని నీరు కలుషితమై ఎలాంటి పంటలు పండక పోవడమే కాకుండా కలుషిత నీరు త్రాగడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వేస్ట్ టు ఎనర్జీ లో భాగంగా ఎనర్జీని ఉత్పత్తి చేయుటకు చెత్త పదార్థములను కాల్చడం వలన వచ్చేటువంటి డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేయడం మూలంగా పరిసర ప్రాంతాల ప్రజలు లంగ్స్ క్యాన్సర్ కు గురికావడమే కాకుండా మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు, జలుబు, దగ్గు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళనను, ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పార్టీలకతీతంగా ముందుకు వచ్చి ఐకమత్యంగా ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయించవలసిన బాధ్యత నాయకులందరి పైన ఉందని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆవేదనను గమనించి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ.. ఈ ప్రాజెక్టును జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, కొలిపాక సమ్మయ్య, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, తులసి లక్ష్మణమూర్తి, పిరమిడ్ సొసైటీ సభ్యులు అనిల్, తడికమల్ల శేఖర్, పెన్షనర్స్ బి వెంకటయ్య, జి సాంబయ్య, డి హరికిషన్, గాజర్ల బుచ్చిరాజం, మండల వీరస్వామి, టి రమేష్, మేకల మొగిలి, టి శ్రీహరి, సాదుల రవీందర్, బీసీ నాయకులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, రావుల రాజేష్, ఇప్పకాయల సాగర్, మార్త రవీందర్, జెకె ప్రభాకర్, మావునూరి ప్రవీణ్, గోస్కుల మధుకర్, నడిగోటి రమేష్, కొలిపాక క్రాంతి, ఆర్ టిఐ సభ్యులు పల్లె సతీష్, బండ నరేందర్, ఎగ్గొజు ప్రసాద్, శనిగరం రవీందర్, తిరగమల్ల నాగార్జున, స్టీరింగ్ కమిటీ సభ్యులు తూముల హనుమంతరావు, వేల్పుల రత్నం, వెంకట్రావు, తునికి సమ్మయ్య, పర్లపల్లి అశోక్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో మాట్లాడుతున్న టా ప్రా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్..


డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు..





