
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం రోజున ఘనంగా నిర్వహించామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకొని, తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హుజూరాబాద్ మండల విద్యాధికారి వి శ్రీనివాస్ హాజరయ్యారు.

మాట్లాడుతున్న ఎంఈఓ వి శ్రీనివాస్

ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి చదివినప్పుడే మనలో మార్పు కనిపిస్తుందని, కిండర్ గార్టెన్ లో భాగంగా మూడు సంవత్సరాల విద్యను అభ్యసించి ఒకటవ తరగతిలో చేరబోతున్న సందర్భంగా మరింత కష్టపడి చదవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తగ్గట్టుగా నేటి విద్యా విధానం మారబోతున్న సందర్భంగా అలాంటి మార్పు మనలో కూడా రావాలని, దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, నాటికలతో ప్రేక్షకులను అలరించారు. తదనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









